Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై వ్యాపారి ఆఫీసు గోడల్లో కరెన్సీ నోట్ల కట్టలు...

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (10:44 IST)
ముంబై మహానగరానికి చెందిన ఓ వ్యాపారికి చెందిన ఆఫీసు గోడల్లో కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్ల కట్టలు వెలుగు చూశాయి. ముంబై నగరంలోని కల్బాదేవి ప్రాంతానికి చెందిన ఈ వ్యాపారి వ్యాపార టర్నోవర్ గత మూడేళ్లలో రూ.1,764 కోట్లకు పెరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన జీఎస్టీ అధికారులు ఆ వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇంట్లో ఒక్క రూపాయి కూడా లభించలేదు. దీంతో ఇంటి గోడలను, నేలను తవ్వి చూడగా ఆశ్చర్యపోయే రీతిలో దాదాపు రూ.10 కోట్ల విలువైన నగదు, వెండి ఇటుకలను వెలుగు చూశాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కల్బాదేవి ప్రాంతానికి చెందిన చాముండా అనే వ్యాపారికి చెందిన కార్యాలయం ఉంది. ఇటీవల ఈ కంపెనీ టర్నోవర్ అకస్మాత్తుగా పెరిగిపోయింది. దీంతో జీఎస్టీ ముంబై శాఖ అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. గత మూడేళ్లలో ఏకంగా రూ.23 లక్షల నుంచి రూ.1764 కోట్లకు పెరగడంతో అధికారుల్లో అనుమానాలు రేకెత్తించింది.
 
దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ వ్యాపారికి చెందిన వ్యాపార కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అయితే, గోడకు అమర్చిన ఓ టైల్స్‌లో తేడా కనిపించింది. దీంతో ఆ టైల్‌ను తొలగించి చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. నగదు కుక్కిన గోనె సంచులు కనిపించడంతో వాటిని వెలికి తీశారు. తీస్తున్న కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. దీంతో అధికారులు నోరెళ్లబెట్టారు.
 
ఈ గోనె సంచలపై ఆరా తీయగా కుటుంబ సభ్యులు తమకేం తెలియదని చెప్పారు. దీంతో జీఎస్టీ అధికారులు ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. అధికారులు వచ్చి ఆ నగదును లెక్కించగా అందులో రూ.9.8 కోట్ల నగదు, రూ.13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలు లభ్యమయ్యాయి. ఈ నోట్ల కట్టలకు సంబంధించి చాముండిపై జీఎస్టీ, ఐటీ శాఖ అధికారులు వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments