తాను గర్భవతిగా వున్నా కూడా సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో ఫోజులిస్తూ నెటిజన్లను ఫిదా చేస్తుంది. బ్లాక్ డ్రెస్‌లో ఇలా కనిపిస్తూ తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తుంది. నలుపు రంగులో కనిపించే ఎంబ్రాయిడరీ కఫ్తాన్‌ను ధరించి కనిపించింది. ఒక చిత్రంలో, ఆమె బేబీ బంప్‌ను ఒక చేత్తో ప్రేమగా పట్టుకుని, మరొకటి తన తలపై ఉంచినట్లు కనిపిస్తుంది. భర్త ఆనంద్ అహూజా, తల్లి సునీతా కపూర్, సోదరి రియా కపూర్‌లను దీనికి ట్యాగ్ చేశారు. ఇక నెటిజన్లు, సెలబ్రిటీలు అయితే ఇంకా ఫిదా అయిపోయారు. అందులో సమంత కూడా వుంది. నిట్టూర్పు. అంటూ.. పోస్ట్ చేసింది.
అనిల్ కపూర్ కుమార్తె సోనంకు సహజంగా వైట్ డ్రెస్ అంటే చాలా ఇష్టమట. ఇన్‌స్ట్రాలో ఫాలోవర్స్‌తో కొన్ని విషయాలు పంచుకుంది. చెవికి తెల్లటి రింగుతోపాటు తను వేసుకున్న వైట్ డ్రెస్ తమ కాస్టూమర్ ప్రత్యేకంగా తయారు చేశారని చెప్పింది. అంతేకాక చేతి హ్యాండ్‌బాగ్‌నూ, క్రెడిట్ కార్డ్‌ను కూడా వైట్‌దే అంటూ చూపించింది. ఇక ఈసారి వేసుకున్న బ్లాక్ డ్రెస్ బేబికోసం పత్రేకంగా వేసుకోవాలనిపించిందని తెలిపింది.
పైగా ఈ డ్రెస్‌తో వున్న పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది: "నా (బేబీ ఎమోజి) #ప్రతిరోజు అసాధారణమైనది. నేను, నా భర్త ఆనంద్ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది.