పోలీసులు లేకుండా యూనివర్సిటీ లకు వెళ్లండి చూద్దాం: ప్రధానికి రాహుల్ సవాల్

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (07:59 IST)
పోలీసులు లేకుండా దేశంలోని యూనివర్శిటీలకు వెళ్లి.. అక్కడి విద్యార్థులను కలిసే దమ్ము ప్రధాని నరేంద్ర మోడీకి ఉందా? అని సవాల్‌ విసిరారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ.

సోమవారం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సోనియాగాంధీ అధ్యక్షతన ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ భ్రష్టు పట్టించారని.. దానిపై విద్యార్థులకు సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ముందు నిలబడటానికి ఆయనకు ధైర్యం లేదన్నారు.

ఏదైనా విశ్వవిద్యాలయానికి పోలీసులు లేకుండా వెళ్లి, అక్కడ ఈ దేశం కోసం ఏమి చేయబోతున్నాడో ప్రజలకు చెప్పాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. మోడీ దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. యువత గొంతును అణిచివేయడం మంచిది కాదు. ప్రభుత్వం తప్పక వినాలని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments