Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : రాహుల్ గాంధీ బస్సు యాత్ర!

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (10:34 IST)
తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. మరో రెండు నెలల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులోభాగంగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన బస్సు యాత్రను చేపట్టనున్నారు. 
 
ఈ నెల 19వ తేదీ నుంచి 21వతేదీ వరకు రాహుల్ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. అయితే, పర్యటన షెడ్యూల్ ఖరారు కావాల్సివుంది. ఈ బస్సు యాత్రలో రాహుల్‌తో పాటు ఇతర కాంగ్రెస్ జాతీయ నేతలు కూడా పాల్గొనే అవకాశమున్నట్టు తెలుస్తోంది. 
 
సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొనేలా ఒప్పించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

ఇదిలావుంటే, ఈ నెల 10న హైదరాబాదులో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్‌పై స్పష్టత రానుంది. 
 
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 6 గ్యారెంటీలను ప్రకటించడం తెలిసిందే. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ తమ గ్యారెంటీలు విజయాన్ని అందిస్తాయని కాంగ్రెస్ ధీమాగా ఉంది. అయితే, ఆరు గ్యారెంటీలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా ఈ బస్సు యాత్రను చేపట్టాలని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments