Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీ నాయకుడే కాదంట...

సుధీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ అస్సలు నాయకుడే కాదట. ఈ మాటలు అంటున్నది పటీదార్ ఉద్యమ యువనేత, గుజరాత్ చిచ్చరపిడుగు హార్ధిక్ పటేల్.

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (11:33 IST)
సుధీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ అస్సలు నాయకుడే కాదట. ఈ మాటలు అంటున్నది పటీదార్ ఉద్యమ యువనేత, గుజరాత్ చిచ్చరపిడుగు హార్ధిక్ పటేల్. తాజాగా ఆయన రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తూనే, ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి రావాలంటూ పిలుపునిచ్చారు. 
 
దీనిపై హార్దిక్ పటేల్ స్పందిస్తూ, తన దృష్టిలో రాహుల్ నాయకుడే కాదు. ఓ వ్యక్తిగా రాహుల్ అంటే తనకు ఇష్టమని... అయితే ఓ నేతగా ఆయనను తాను ఎన్నడూ చూడలేదు. పైగా, ఆయన చెప్పే విషయాలను పాటించడానికి... ఆయన తనకు అధిష్టానం కాదన్నారు. అదేసమయంలో ఆయన సోదరి ప్రియాంక వాద్రా రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. 
 
ఎందుకంటే, ప్రియాంకలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని... ఇది నా అభిప్రాయమన్నారు. 2019 ఎన్నికల్లో పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి తరపును తాను పోటీ చేయబోనని హార్దిక్ స్పష్టం చేశారు. కాగా, ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయని విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments