బీహార్‍లో బీజేపీ రిమోట్ కంట్రోల్ సర్కారు : రాహుల్ గాంధీ

ఠాగూర్
బుధవారం, 29 అక్టోబరు 2025 (16:54 IST)
బీహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాన్ని నడుపుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకోసం బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను పావుగా వాడుకుంటోందని ఆయన మండిపడ్డారు. బీహార్ రాష్ట్రంలో భాజపా నేతృత్వంలోని కేంద్రం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని విమర్శించారు. 
 
ప్రతిపక్షాలు పట్టుబట్టడం వల్లే నరేంద్ర మోడీ ప్రభుత్వం కుల గణనకు అంగీకరించిందన్నారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముజఫర్ పూర్‌లో నిర్వహించిన తన తొలి ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. మహారాష్ట్ర, హర్యానా ఓట్ల చోరీ జరిగిందని, బిహార్‌లోనూ ఇది పునరావృతమవుతుందని ఆరోపించారు.
 
'బీహార్ ప్రభుత్వం రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా నడుస్తోందని తేజస్వీ యాదవ్‌ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. భాజపా కేవలం నీతీశ్‌ కుమార్‌ను వాడుకుంటోంది. దేశసంపద కొంతమంది సంపన్నుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. బీహార్‌ వంటి ప్రాంతాలు పేదరికంలో కూరుకుపోవడానికి ఇదే కారణం. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టంపై ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారు. 
 
బీహార్ రాష్ట్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడతామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రజలు తమ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆధునిక నలంద విశ్వవిద్యాలయానికి కాంగ్రెస్‌ హయాంలోనే నాంది పడిందన్నారు. భవిష్యత్తులో అమెరికన్లు సైతం తమ ఉన్నత విద్య కోసం ఇక్కడి వస్తారని జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments