ఏపీలో టీడీపీ జనసేన, టీడీపీ పొత్తు వుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రచారం చేస్తాయని తెలుస్తోంది. ఎలాగంటే.. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తనకు టీడీపీ, జనసేన మద్దతు వుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వాళ్లు తన ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని తనకు సమాచారం ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ మంచి మెజార్టీతో జూబ్లీహిల్స్ లో గెలవనుందని జోస్యం చెప్పారు.
నేటి కాంగ్రెస్, గత బీఆర్ఎస్ ప్రభుత్వాలు నియోజకవర్గంలో కనీసం డ్రైనేజీ సమస్యను కూడా పరిష్కరించలేకపోయారని ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్లకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.