పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మపై మంత్రి నారాయణ జీరో పేరుతో చేసిన వ్యాఖ్యల వ్యవహారం కలకలం రేపింది. తన మాటలను వక్రీకరించారని, పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలను జీరో చేశానని చెప్పానని మంత్రి పి నారాయణ వివరణ ఇచ్చారు.
తన మాటలను వక్రీకరించారని, పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలను 'జీరో' చేశానని చెప్పానని మంత్రి పి నారాయణ వివరణ ఇచ్చారు. వర్మ కూడా టీడీపీలో తాను పిల్లర్ లాంటి వాడినని.. కూటమి మధ్య విభేదాలు సృష్టించడం ఎవరి వల్లా కాదని స్పష్టం చేశారు.
ఎన్డీఏ కూటమిలో పార్టీలన్నీ కలిసే ఉన్నాయన్నారు. విశాఖపట్నంలో మంత్రి నారాయణ, వర్మతో కలిసి పర్యటించారు. పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 50 వేల ఓట్లతో గెలిచిన బలమైన నాయకుడు వర్మ అన్నారు. పిఠాపురంలో జనసేన, టీడీపీ సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ.
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. చంద్రబాబు ఆగమంటే ఆగుతా.. దూకమంటే దూకుతా అంటూ ఘాటుగానే స్పందించారు. కొంతమంది పేటీఎం బ్యాచ్ ప్రచారాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
మంత్రి నారాయణ వ్యాఖ్యలపై కొంతమంది తప్పుడు ప్రచారం చేశారన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో పిల్లర్ వంటి వాడినన్నారు. మంత్రి నారాయణ జనసేన టీడీపీ మధ్య కాకినాడ జిల్లాలో వారధిగా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు.