Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

RSS sena: అరి చిత్రంపై ఆర్ఎస్ఎస్ సేన డిమాండ్ - మంచు విష్ణు యాక్షన్ తీసుకున్నాడా?

Advertiesment
Ari poster at Saptagiri theater

చిత్రాసేన్

, సోమవారం, 13 అక్టోబరు 2025 (07:35 IST)
Ari poster at Saptagiri theater
ఇటీవలే విడుదలైన అరి సినిమాలో ఏముందో తెలుసుకోకుండా ఈ చిత్రంపై దుష్రచారం చేస్తూ, పోస్టర్స్ చించేస్తున్న వారు క్షమాపణలు చెప్పాలని ఆర్ఎస్ఎస్ సేన నాయకులు డిమాండ్ చేశారు. నేటి సమాజానికి, యువతకు ఈ సినిమా చాలా అవసరం అని, తప్పుదారిలో వెళ్తున్న సమాజానికి మంచిని చెప్పే ప్రయత్నం అరి సినిమాతో దర్శకుడు జయశంకర్ చేశారని ఆర్ఎస్ఎస్ సేన నాయకులు అన్నారు. ఆదివారంనాడు హైదరాబాద్ సప్తగిరి థియేటర్ వద్ద సినిమా చూసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
 
వివరాల్లోకి వెళితే... ఆరి సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ఆయన మహాత్మాగాంధీ గురించి కొన్ని వ్యాఖ్యాలు చేశారు. ఆయన స్రీ లోలుడు అని అలాంటి వ్యక్తి జాతిపిత ఎందుకయ్యారనేది ఆయన ప్రశ్న. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్ కు వివపరీతమైన రియాక్షన్ వచ్చింది. ఇది జరిగిన రెండు రోజులకే ఆయన నటించిన ఆరి సినిమా విడుదలైంది.
 
అలాగే మూవీ ఆర్టిస్స్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు విష్ణు కు కూడాఓ రాజకీయ పార్టీకి చెందిన కొందరు ఆయన సభ్యత్వం రద్దు చేయాలని లిఖితపూర్వకంగా కోరారు.  దీనిపై విష్ణు ఏ నిర్ణయం తీసుకున్నాడో త్వరలో తెలుస్తుంది.
 
ఓ పార్టీ నేతలు "అరి" సినిమా పోస్టర్స్ చింపుతూ, ఈ చిత్ర విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారు సినిమా చూసి మాట్లాడాలని ఆర్ఎస్ఎస్ సేన నేతలు అన్నారు. దుష్ప్రచారం చేస్తున్న వారు "అరి" చిత్ర బృందానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
 
ఈ సినిమాను ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి,  డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించారు, లింగ గుణపనేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న థియేటర్స్ లోకి వచ్చి, ప్రేక్షకాదరణ పొందుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Ram Charan: ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు