Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సపోటా తోటలో మైనర్ బాలికపై తుని టీడీపీ లీడర్ అత్యాచారయత్నం

Advertiesment
Tuni tdp leader narayana rao

సెల్వి

, బుధవారం, 22 అక్టోబరు 2025 (12:25 IST)
Tuni tdp leader narayana rao
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. తునిలో వృద్ధ కీచకుడి బాగోతం బయటపడింది. మైనర్ బాలికపై టీడీపీ నేత తాటిక నారాయణ రావు అత్యాచారయత్నం చేశాడు. బాలికను హాస్టల్ నుంచి తీసుకుని వెళ్లి హంసవరం సపోటా తోటల్లో అత్యాచార యత్నం చేశాడు. 
 
తుని రూరల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై తాటిక నారాయణ రావు ఈ అకృత్యానికి దారి తీయడం స్థానికంగా కలకలం రేపింది. 
 
నారాయణరావు బాగోతాన్ని గుర్తించిన స్థానికులు.. వెంటనే స్పందించి మైనర్‌ను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారా అనేది ఇంకా తెలియాల్సి వుంది. అయితే, హాస్టల్ నుండి మైనర్‌ను నారాయణరావు బయటకు తీసుకువెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడులో భారీ వర్షాలు.. చెన్నైలో మూతపడిన పాఠశాలలు