రాజమండ్రిలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను హాస్టల్ నుంచి బైటకు తీసుకెళ్లి అత్యాచారం చేసాడు. బాధితురాలు రాజమండ్రి టూటౌన్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
రాజమండ్రిలో వున్న ఓ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం హాస్టలులో వుండి చదువుకుంటున్న విద్యార్థిని సోమవారం నాడు సాయంత్రం తన అన్నయ్య వచ్చాడనీ, బైటకెళ్లి వస్తువులు కొనుక్కోవాలని వార్డెన్‌కి చెప్పి వెళ్లింది. ఐతే వచ్చిన యువకుడు బాలికను తన వాహనంపైన ఎక్కించుకుని గోదావరి గట్టుపైకి తీసుకెళ్లాడు.
అక్కడ మరో యువకుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమెను రాజమండ్రి రైల్వే స్టేషనులో వున్న ఓ లాడ్జికి తీసుకుని వెళ్లాడు. ఆ లాడ్జి గదిలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలిని దేవిచౌక్ లో దింపేసి వెళ్లిపోయాడు. నిందితుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకి చెందిన అజయ్ గా పోలీసులు గుర్తించారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.