Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీని హగ్ చేసుకున్న రాహుల్: 3 నెలల ప్లానట.. యోగి సవాల్.. అవి పిల్లచేష్టలు?

వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ.. తన అద్భుత స్పీచ్‌తో ప్రభుత్వాన్ని ఏకిపా

Webdunia
బుధవారం, 25 జులై 2018 (17:40 IST)
వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహు
ల్ గాంధీ.. తన అద్భుత స్పీచ్‌తో ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ఆపై ప్రధాని మోదీని ఆలింగనం చేసుకున్నారు. చివర్లో కన్నుగీటారు. ఈ వ్యవహారమంతా వైరల్ అయ్యింది.
 
అయితే మోదీని రాహుల్ ఆలింగనం చేసుకోవడం.. అనుకోకుండా జరగలేదని.. మూడు నెలల పాటు ఇందుకు ప్లాన్ జరిగిందని టాక్. దేశమంతా గుర్తించేలా ఏదైనా పనిచేయాలని, అందులో ప్రధానిని కూడా భాగం చేయాలని ఆయన ఆలోచించి, ఈ పని చేశారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 
 
ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని, తన తల్లిని పదే పదే విమర్శలు చేస్తున్న ప్రధానికి రాహుల్ గాంధీ ఆలింగనం ద్వారా నిరసన తెలిపారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఆయన తన ఆలింగనం ద్వారా ప్రధానిని ఆశ్చర్యపోయేటట్టు చేశారని అందరూ భావిస్తున్నారని, కానీ ఈ విషయంలో రాహుల్ టైమింగ్ మాత్రం ప్రధానితో తలపడటాన్నే సూచిస్తోందన్నారు. వాస్తవానికి ప్రధాని మాట్లాడే సమయంలోనో లేదా తన ప్రసంగం మధ్యలోనో ఆలింగనం చేసుకోవాలనుకున్నారు. కానీ ప్రసంగం ముగిసిన తర్వాత ఆ పని చేశారని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. 
 
ఇదిలా ఉంటే రాహుల్ కౌగిలింత స్పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉచిత కౌగిలింత (ఫ్రీ హగ్) కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కోరుకున్న వారికి కౌగిలింత ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ''విద్వేషాన్ని తుడిచేద్దాం'', ''ద్వేషానికి నో చెబుదాం'', ''దేశాన్ని కాపాడుదాం'' పేరుతో ప్లకార్డుల్ని ప్రదర్శించారు.
 
మరోవైపు లోక్‌సభలో ప్రధాని మోదీని ఆలింగనం చేసుకోవడం కాదని, దమ్ముంటే తనను ఆలింగనం చేసుకోవాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సవాలు విసిరారు. తనను హత్తుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని అన్నారు. రాహుల్ హగ్ ఓ పొలిటికల్ స్టంట్ అని కొట్టిపడేశారు. అతడివి పిల్ల చేష్టలని యోగి కొట్టిపారేశారు. రాహుల్‌కు హుందాతనం, తెలివి తేటలులేవని, అందుకే ఇలా ప్రవర్తించారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

రామానంద్ సాగర్ కు అంకితంగా శ్రీమద్ భాగవతం పార్ట్-1 షూటింగ్ ప్రారంభం

పుష్ప జాతర సీన్ కు మించి కొత్తపల్లిలోఒకప్పుడు చిత్రంలో వుంది : డైరెక్టర్ ప్రవీణ పరుచూరి

సుబోధ్ భావే తో ఆదిత్య ఓం తెరకెక్కించిన సంత్ తుకారాం సిద్ధమైంది

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments