Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురుగు నీటి గుంతలో పడి రేడియో మిర్చి ఉద్యోగి ప్రాణాలు కోల్పోయింది...

ప్రభుత్వ అధికారుల ఉదాసీనత వల్ల ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే, రహదారులపై తగిన హెచ్చరిక గుర్తులు లేకపోవడం వల్ల వాహనచోదకులు సైతం ప్రమాదాలకు గురై చనిపోతున్నారు.

Webdunia
బుధవారం, 2 మే 2018 (15:38 IST)
ప్రభుత్వ అధికారుల ఉదాసీనత వల్ల ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే, రహదారులపై తగిన హెచ్చరిక గుర్తులు లేకపోవడం వల్ల వాహనచోదకులు సైతం ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. తాజాగా, మురుగు నీటి గుంతలో పడి రేడియే మిర్చిలో పని చేసే ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాద వివరాలను పరిశీలిస్తే...
 
రేడియో మిర్చి మార్కెటింగ్ టీమ్‌లో పని చేస్తున్న తాన్యా ఖన్నా (26) మంగళవారం రాత్రి 2.30 గంటల సమయంలో నోయిడాలోని సెక్టర్ 94 రోడ్డులో కారులో వెళుతుండగా, అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న మురుగు నీటిగుంతలో పడిపోయింది. ఆమె తన వెర్నా కారుతో సహా ఈ గుంతలో బోల్తాపడింది. ఆమె ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా జరిగిన ఓ సమావేశంలో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 
 
ఓ కారు వేగంగా మురికి నీటి గుంతలోకి దూసుకెళ్ళిపోవడాన్ని గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి, సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి, కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments