Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రదాని నివాసం మారింది.. 7 రేస్‌కోర్స్ కాదు.. లోక్ కల్యాణ్‌మార్గ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక నివాసం రోడ్డు పేరు మారింది. ఇప్పటివరకు ఆయన నివాసం ఉండే రోడ్డు పేరు రేస్‌కోర్స్ రోడ్‌‌గా ఉండేది. ఇకపై... ఆ రోడ్డు పేరును రేస్‌కోర్స్ లోక్‌కల్యాణ్‌మార్గ్ రోడ్డుగా మార్

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (11:54 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక నివాసం రోడ్డు పేరు మారింది. ఇప్పటివరకు ఆయన నివాసం ఉండే రోడ్డు పేరు రేస్‌కోర్స్ రోడ్‌‌గా ఉండేది. ఇకపై... ఆ రోడ్డు పేరును రేస్‌కోర్స్ లోక్‌కల్యాణ్‌మార్గ్ రోడ్డుగా మార్చేశారు. 7 రేస్‌కోర్స్ భారతీయ సంస్కృతికి సరిపడేలా లేదని, అందుకే పేరు మార్చనున్నామని బీజేపీ నేత మీనాక్షీలేఖి తెలిపారు. 
 
గతంలో ఈ రహదారిలో బీజేపీ నేత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఏకాత్మ మార్గ్ పేరు పెట్టాలనే ప్రతిపాదన వచ్చిందని ఆమె చెప్పారు. గతేడాది ఔరంగజేబు రోడ్‌కు ఏపీజే అబ్దుల్‌కలాం పేరు పేడితే మిశ్రమస్పందన వచ్చింది. కొందరు సమర్థిస్తే మరికొందరు వ్యతిరేకించారు. 
 
1940లో ఢిల్లీలో రేస్ క్లబ్‌కు గుర్తుగా రేస్ కోర్స్ రోడ్ అని ఈ రహదారికి నామకరణం చేశారు. 1984లో రాజీవ్ గాంధీ ఈ రోడ్డులోని 7వ నెంబర్ ఇంట్లో అధికారిక నివాసాన్ని ఏర్పాటు చేసుకోగా, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ 5వ నెంబర్ ఇంటిని నివాసంగా, 7వ నెంబర్ ఇంటిని కార్యాలయంగా నిర్వహిస్తున్నారు. 
 
రేస్ కోర్స్ రోడ్ పేరును 'లోక్ కల్యాణ్ మార్గ్'గా మారుస్తూ అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన సమావేశమైన న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments