Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో కుక్క.. పంది... బర్రెలు ఉన్నాయా.. అయితే పన్ను చెల్లించాల్సిందే.. ఎక్కడ?

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దేశం... ఒకే పన్ను అనే నినాదంతో జీఎస్టీ పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (15:43 IST)
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దేశం... ఒకే పన్ను అనే నినాదంతో జీఎస్టీ పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అలాగే, పంజాబ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా బాధ్యతలు చేపట్టింది. అయితే, ఈ రాష్ట్రంలో ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే పన్ను చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు జారీఅయ్యాయి. 
 
ఈ తరహా ఆదేశాలు జారీ చేసింది ఎవరో కాదు భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ. ఈ ఉత్తర్వుల మేరకు పిల్లి, కుక్క, పంది, గుర్రం, ఆవు, ఏనుగు, ఒంటె, బర్రె ఇలా ఏ పెంపుడు జంతువైనా ఇంట్లో ఉన్నట్టయితే పన్ను కట్టాల్సిందే. పంచాయతీలను మాత్రం ఈ పన్ను పరిధి నుంచి మినహాయించారు. జంతువులను బట్టి రూ.200 నుంచి రూ.500వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. 
 
ఒకవేళ పన్ను కట్టకపోతే... మున్సిపల్ సిబ్బంది ఆ జంతువులను స్వాధీనం చేసుకుంటారు. అయితే, కోళ్లు, చిలుకలు, పావురాలు వంటి పక్షులకు కూడా పన్ను వర్తిస్తుందా? లేదా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఈ పన్ను విధింపు ఉత్తర్వులపై పంజాబ్ రాష్ట్ర ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం