Webdunia - Bharat's app for daily news and videos

Install App

సబార్డినేట్‌ భార్యతో రాసలీలలు... కటకటాల వెనక్కి కల్నల్

సబార్డినేట్ భార్యతో రాసలీలలు నెరిపిన కల్నల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఇది ఇండియన్ ఆర్మీలో పెను సంచలనంగా మారిన విషయం తెల్సిందే. గత నెల 26వ తేదీన లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇంట్లో ఆ

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2017 (16:38 IST)
సబార్డినేట్ భార్యతో రాసలీలలు నెరిపిన కల్నల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఇది ఇండియన్ ఆర్మీలో పెను సంచలనంగా మారిన విషయం తెల్సిందే. గత నెల 26వ తేదీన లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇంట్లో ఆయన భార్యతో ఉన్న కల్నల్‌ను మిలటరీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం భటిండాలోని సైనిక ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇచ్చిన సమాచారంతోనే ఆయన ఇంట్లో సోదాలు చేసి వారిద్దరినీ అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
 
కాగా, నిందితుడు భటిండా జోన్లో అడిషనల్ చీఫ్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. అతడితో పాటు మరో వ్యక్తి లెఫ్టినెంట్ కల్నల్‌ (సబార్డినేట్)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఓసారి స్నేహపూర్వకంగా ఇంటికి వచ్చి అతడి భార్యపై కన్నేశాడు. మెల్లగా ఆమెతో స్నేహం పెంచుకుని అవకాశం కోసం ఎదురుచూడసాగాడు. లెఫ్టినెంట్ కల్నల్ పనిపై చండీగఢ్ వెళ్లడంతో అదే అదనుగా అతడి భార్య వద్దకు వచ్చేశాడు. 
 
తన భార్య తీరుపై అనుమానం వచ్చిన లెఫ్టినెంట్ కల్నల్ మిలటరీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు అర్థరాత్రి సమయంలో ఇంటికి వచ్చి వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి పరీక్ష చేశారు. కాగా సహోద్యోగి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఆర్మీలో తీవ్రమైన నేరం. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి శిక్ష విధించాలన్నది సైనిక కోర్టు నిర్దేశించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ల‌ ఒసేయ్ అరుంధతి

హీరో సూర్య 45 సినిమా ఆనైమలైలో గ్రాండ్ గా లాంచ్

మహేష్ బాబు లాంచ్ చేసిన ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments