పుణె అత్యాచారం కేసు: బస్సులో వందలకొద్దీ కండోమ్స్, మహిళల లోదుస్తులు

ఐవీఆర్
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (15:34 IST)
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన పూణె లైంగికదాడి కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. అత్యాచారానికి పాల్పడ్డ రాందాస్ అనే కామాంధుడు గతంలోనూ ఎన్నో దారుణాలు చేసినట్లు బస్సులో ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. బాధితురాలిపై అతడు అత్యాచారం చేసిన బస్సును పోలీసులు తనిఖీలు చేయగా అందులోని క్యాబిన్లో వందలకొద్దీ కండోమ్స్, మహిళల లోదుస్తులు బయటపడ్డాయి. వీటినిబట్టి గతంలో ఇతడి చేతిలో మరికొందరు మహిళలు అఘాయిత్యానికి గురై వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
కాగా నిందితుడు దత్తాత్రేయ రాందాస్ గడేను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని అత్యంత రద్దీ బస్ స్టేషన్‌లో ఒకటైన స్వర్‌గేట్ బస్టాండ్‌లో మంగళవారం ఉదయం బస్సు కోసం వేచి చూస్తున్న 26 యేళ్ల యువతితో అక్కా అని మాటలు కలిపిన నిందితుడు, ఆపై ఆమె వేచి చూస్తున్న బస్సు మరో ప్రాంతంలో ఉందని నమ్మించి బస్టాండ్ చివరకు తీసుకెళ్లాడు. అక్కడ ఆగివున్న బస్సులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర సంచలనంగా మారింది. రాజకీయంగానూ దుమారం రేపింది. నిందితుడుని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 
 
బాధిత యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బస్టాండులోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడుని 36 యేళ్ల దత్తాత్రేయ రాందాస్‌గా గుర్తించారు. అతడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిలుపై ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం ఎనిమిది పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే, నిందితుడు చెరుకు తోటల్లో దాగడంతో డ్రోన్ల సాయంతో గుర్తించి అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో శిరూర్ తహసీన్‌లోని ఓ గ్రామంలో దాక్కున్న నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తె న్యూడ్ ఫోటోలు అడిగారు: నటుడు అక్షయ్ కుమార్ ఆవేదన

ముగిసిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా నిశ్చితార్థం

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments