పూణేలో షాకింగ్ ఘటన.. యూట్యూబ్​లో వీడియో చూసి బిడ్డకు జన్మనిచ్చింది..!

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (19:20 IST)
మహారాష్ట్ర పుణెలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్ వీడియో ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొండ్వాలోని ధ్వాడేకు చెందిన ఓ బాలిక యూట్యూబ్​లో వీడియో చూసి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ నవజాత శిశువును కిటీకీలో నుంచి బయటకు విసిరేసింది. దీనిపై ఉత్తమ్​ నగర్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. 
 
బాలిక కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండగా.. ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లింది. బాలికను పరీక్షించిన డాక్టర్​ గర్భవతి కావచ్చేమో అని అనుమానించి.. సోనోగ్రఫీ పరీక్ష చేయించాలని సూచించారు. వైద్యులు సూచించినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఇంటికి వెళ్లారు తల్లీకూతురు. 
 
ఇదిలా ఉండగా.. వారు నివసిస్తున్న ప్రాంతంలో అప్పుడే పుట్టిన ఓ నవజాత శిశువు స్థానికులకు కనిపించింది. అదే రోజు రాత్రి బాలిక ఆస్పత్రిలో కనిపించింది. దీంతో అనుమానం వచ్చి బాలికను ప్రశ్నించగా.. విస్తుపోయే నిజాన్ని వెల్లడించింది. తానే యూట్యూబ్​లో వీడియో చూసి బిడ్డకు జన్మనిచ్చానని.. తరువాత బిడ్డను కిటికీ నుంచి కిందకు విసిరేసినట్లు చెప్పింది. ఈ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం