Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాలా బ్యూటీగా ఉన్నావ్.. నా కోర్కె తీరిస్తే హీరోయిన్‌గా ఛాన్సిస్తా...

సినీ ఛాన్స్‌ కోసం ఓ దర్శకుడు వద్దకు వెళ్లిన ఓ విద్యార్థినికి ఊహించని సంఘటన ఒకటి ఎదురైంది. సినీ ఛాన్స్ అడిగితే కోర్కె తీర్చమన్నాడు. చాలా బ్యూటీగా ఉన్నావ్.. హీరోయిన్‌గా అవకాశం ఇస్తా.. ఇందుకు నా కోర్కె త

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2017 (08:49 IST)
సినీ ఛాన్స్‌ కోసం ఓ దర్శకుడు వద్దకు వెళ్లిన ఓ విద్యార్థినికి ఊహించని సంఘటన ఒకటి ఎదురైంది. సినీ ఛాన్స్ అడిగితే కోర్కె తీర్చమన్నాడు. చాలా బ్యూటీగా ఉన్నావ్.. హీరోయిన్‌గా అవకాశం ఇస్తా.. ఇందుకు నా కోర్కె తీర్చాలని కోరాడు. దీంతో షాక్‌కు గురైన ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
మహారాష్ట్రలోని జెజూరీ గ్రామానికి చెందిన 19 ఏళ్ల ఓ అమ్మాయి పూణే నగరంలోని ఓ ప్రముఖ కళాశాలలో చదువుకుంటోంది. సెలవుల్లో తన స్వగ్రామమైన జెజూరీకి వచ్చిన అమ్మాయికి వాట్సాప్‌లో తాము కొత్తగా నిర్మించనున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో సినిమాలో నటించాలనే తన కలను నిజం చేసుకుందామని భావించిన కళాశాల విద్యార్థిని... అడిషన్స్ కోసం పూణేకు వచ్చింది 
 
ఆ తర్వాత మెసేజ్‌లో పేర్కొన్నట్టుగా కాలేవాడీలోని తప్కీర్ చౌక్‌ చిరునామాకు వెళ్లి అక్కడ సినీదర్శకుడు అప్పా పవార్‌ను కలిసింది. దర్శకుడు కాస్తా ఆడిషన్ చేయకుండానే తన లైంగిక కోరిక తీరిస్తే సినిమాల్లో నటించేందుకు పలు అవకాశాలు కల్పిస్తానని హామీఇచ్చాడు. దర్శకుడి మాటలతో షాకింగ్‌కు గురైన కళాశాల అమ్మాయి భయంతో అక్కడి వెళ్లిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై తాము ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

Dhanush: కలాం గా ధనుష్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ ఆవిష్కరణ

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం