Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్జీ గేమ్‌పై స్పందించిన మోడీజీ... ఏమన్నారంటే?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (13:18 IST)
ఢిల్లీలో మోడీజీ 24 రాష్ట్రాల విద్యార్థులకు మోటివేషన్ స్పీచ్ ఇవ్వడానికి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసారు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ల హవా నడుస్తోంది. ప్రతిఒక్కరి చేతిలో రెండు మూడు స్మార్ట్‌ఫోన్‌లు దర్శనమిస్తున్నాయి. ఇక అందులో ఆడే గేమ్‌ల గురించైతే చెప్పాల్సిన పనే లేదు. గంటల తరబడి చిన్నాపెద్దా అనే తేడా లేకుండా వాటిలోనే మునిగి తేలుతున్నారు. 
 
బ్లూవేల్ గేమ్ గురించి మరవకముందే పబ్జి గేమ్ ప్రభంజనం మొదలైంది. పిల్లలైతే అదే పనిగా దీనిని ఆడుతున్నారు. దీనిపై ఆందోళన చెందిన ఒక తల్లి ఈ కార్యక్రమంలో మోడీని సలహా కోరగా ఆయనిచ్చిన సమాధానం మొదట సరదాగా, తర్వాత ఆలోచింపజేసే విధంగా ఉంది.
 
మా అబ్బాయి ఇంతకుముందు బాగా చదివి, అందరి ప్రశంసలు అందుకునేవాడు. ఇప్పుడు గంటల తరబడి పబ్జి గేమ్ ఆడుతున్నాడు, ఎంతచెప్పినా వినడం లేదు, ఎలా దూరంగా ఉంచాలో సలహా ఇవ్వమని ఒక తల్లి కోరగా... స్పందించిన మోడీ సరదాగా ''ఏ పబ్జి వాలా హై క్యా'' అని మొదలుపెట్టి గేమ్స్‌కు మీ పిల్లలు అడిక్ట్ అవుతున్నారని ఏకంగా టెక్నాలజీనే వారికి దూరం చేయడం మంచిది కాదన్నారు.
 
నాణేనికి రెండు వైపులు ఉన్నట్టు ప్రతిదాంట్లో ప్లస్, మైనస్ ఉంటాయన్నారు. కనుక మీ పిల్లలకు ఏది అవసరమో తల్లిదండ్రులైన మీరే నిర్ణయం తీసుకోవాలి. టెక్నాలజీని వారు నెగెటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా ఉపయోగించేలా మీరే జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమంగా ఫోన్‌లో గేమ్స్ ఆడే పరిస్థితి నుండి గ్రౌండ్‌కు వెళ్లి ఆడుకునే స్థితికి తీసుకొచ్చే బాధ్యత తల్లిదండ్రులదేనని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments