Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్టిఫికేట్ కావాలంటే కోర్కె తీర్చాల్సిందే.. టీచర్‌కు స్కూల్ కరస్పాండెంట్ టార్చర్

తమ స్కూల్‌లో మానేసి మరో స్కూల్‌లో చేరిన మహిళా ఉపాధ్యాయురాలిని పాఠశాల కరస్పాండెంట్ లైంగికంగా వేధించాడు. ఒరిజినల్ సర్టిఫికేట్లు కావాలంటే ఒక్కసారి గదిలోకి వచ్చి కోర్కె తీర్చాల్సిందేనని పట్టుబట్టాడు.

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (08:34 IST)
తమ స్కూల్‌లో మానేసి మరో స్కూల్‌లో చేరిన మహిళా ఉపాధ్యాయురాలిని పాఠశాల కరస్పాండెంట్ లైంగికంగా వేధించాడు. ఒరిజినల్ సర్టిఫికేట్లు కావాలంటే ఒక్కసారి గదిలోకి వచ్చి కోర్కె తీర్చాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో ఆమె పోలీసులను ఫిర్యాదు చేసింది. చెన్నై మహానగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ సంఘటన చోటుచేసుకోగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
చెన్నైలోని ఓ ప్రైవేటు ఆ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్‌ రెండు నెలల కిందటే తన ఉద్యోగాన్ని వదిలేసి మరో పాఠశాలలో చేరింది. అయితే, గురువారం ఆ టీచర్‌ తన ఒరిజినల్‌ సర్టిఫికెట్ల కోసం పాత పాఠశాలకు వచ్చి, కరస్పాండెంట్‌ రవిని సంప్రదించింది. 
 
కామంతో కళ్లుమూసుకునిపోయిన రవి... నీకు ఒరిజినల్ సర్టిఫికేట్లు కావాలంటే గదికి వచ్చి తన కోర్కె తీర్చాల్సిందేనంటూ ఒత్తిడి తెచ్చాడు. ఒప్పుకోకపోతే ఆమె గురించి చెడుగా ప్రచారం చేస్తానంటూ బెదిరించాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయిన టీచర్‌కు అసభ్య సందేశాలు పంపించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం