Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడి పంతులుగా మారనున్న రాష్ట్రపతి.. 80 మంది విద్యార్థులకు బోధన

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సెప్టెంబర్ 5న నిర్వహించబోయే ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా టీచర్‌గా మారనున్నారు. టీచర్స్ డే సందర్భంగా రాష్ట్రపతి డాక్టర్. రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయ విద్యార్థులకు పాఠా

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (15:47 IST)
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సెప్టెంబర్ 5న నిర్వహించబోయే ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా టీచర్‌గా మారనున్నారు. టీచర్స్ డే సందర్భంగా రాష్ట్రపతి డాక్టర్. రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయ విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నారు. అదే రోజు ఢిల్లీలో వివిధ ప్రభుత్వ పాఠశాలల టీచర్లతో ప్రణబ్ సమావేశం కానున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్కు సమీపంలో ఉన్న ఈ విద్యాలయంలో 11,12 వ తరగతి చదువుతున్న మొత్తం 80 మంది విద్యార్థులు ప్రణబ్ చెప్పబోయే పాఠాలకు హాజరు కానున్నట్టు ప్రకటన విడుదల చేశారు. 
 
ఈ కార్యక్రమాన్ని డీడీ న్యూస్, డీడీ భారతీ ఛానల్స్లో ఉదయం 10.30 గంటల నుంచి ప్రసారం చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చని, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ వెబ్కాస్ట్.గవర్నమెంట్.ఇన్ ప్రెసిడెంట్లో లైవ్గా వెబ్ కాస్ట్ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విడుదల చేయబోయే "ఉమాంగ్ 2015" బుక్లెట్ తొలి ప్రతిని ప్రణబ్ అందుకోనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments