Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ త‌లాక్ బిల్లుకు ఆమోదం వేస్తారనీ ఆశిస్తున్నా : రాంనాథ్ కోవింద్

దేశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన త‌ర్వాత తొలిసారి రాంనాథ్ కోవింద్ ఉభ‌య‌స‌భ‌లను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (11:33 IST)
దేశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన త‌ర్వాత తొలిసారి రాంనాథ్ కోవింద్ ఉభ‌య‌స‌భ‌లను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాలు, ప‌థ‌కాల గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. దేశ స్వ‌ప్నాలను సాకారం చేసుకునేందుకు కృషి చేయాల‌ని, ట్రిపుల్ త‌లాక్ బిల్లు ఆమోదం పొందుతుంద‌ని తాను ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 
 
అలాగే, పేద‌లు, ఉన్న‌త వ‌ర్గాల మ‌ధ్య అంత‌రాన్ని త‌గ్గించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, రైతుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉండి, వారి ఆదాయాన్ని పెంచే ప్ర‌య‌త్నం చేయాల‌ని కోరారు. స్వయం స‌హాయ‌క బృందాల‌ను ప్రోత్స‌హిస్తూ, దేశ అభివృద్ధిలో వారిని భాగం చేయాల‌ని రాంనాథ్ కోవింద్ వివ‌రించారు. 
 
ఆదివాసీలు, గ్రామీణులు, వృద్ధులు, దివ్యాంగులు, మ‌హిళ‌లు, మైనార్టీల‌ కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు, ప్ర‌యోజ‌నాలు, వాటిలో సాధించిన విజ‌యాల గురించి ఆయ‌న చెప్పారు. ముస్లిం హ‌జ్ యాత్ర‌లో ప్ర‌భుత్వం చేసిన మార్పుల కార‌ణంగా ముస్లిం మ‌హిళ‌ల‌కు ప్ర‌యోజనం చేకూరింద‌ని ఆయ‌న అన్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments