Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంతూరుకు వలస కూలీలు ... రోడ్డుపై ప్రసవం.. ఆ వెంటనే నడక

Webdunia
బుధవారం, 13 మే 2020 (11:11 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా రవాణా సౌకర్యాలు బంద్ అయ్యాయి. అయితే, ఇటీవల లాక్డౌన్ ఆంక్షలను కేంద్రం సడలించింది. ముఖ్యంగా, వలస కూలీలు తమతమ సొంతూళ్ళకు వెళ్లేందుకుగాను రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు అనుమతిచ్చింది. పైగా, వలస కూలీల కోసం ప్రత్యేక రైళ్లను కూడా కేంద్రం నడుపుతోంది. అలాగే పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ ప్రాంతాలకు చెందిన వలస కూలీలను స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని మధ్యప్రదేశ్ వలస కూలీలు కూడా తమ స్వస్థలాలకు బయలుదేరారు. ఇందులో ఓ నిండు గర్భిణి కూడా తన భర్తతో కలిసి తమ స్వస్థలమైన సత్నాకు చేరుకునేందుకు కాలినడక ప్రారంభించింది. నెలలు నిండటంతో మార్గమధ్యంలోనే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో, రోడ్డు పైనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 
 
ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే, ప్రసవించిన రెండుగంటల తర్వాత తమ బిడ్డతో సహా భార్యాభర్త తిరిగి నడక ప్రారంభించారు. అప్పుడే పుట్టిన బిడ్డతో కలిసి మరో 150 కిలో మీటర్లు నడిచింది. సత్నా సరిహద్దులో వారిని అధికారులు గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments