Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌరీ లంకేశ్‌ను ''కుక్క'' అని నేరుగా ప్రస్తావించలేదు.. ప్రమోద్ ముథాలిక్ వివరణ

ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్‌పై శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో హత్యకు గురైన గౌరీ లంకేశ్‌ను ''కుక్క'' అంటూ సంబోధించారు. లంకేశ్ హత్య కేసులో

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (09:27 IST)
ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్‌పై శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో హత్యకు గురైన గౌరీ లంకేశ్‌ను ''కుక్క'' అంటూ సంబోధించారు. లంకేశ్ హత్య కేసులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని, మౌనం వీడాలంటూ వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో ఓ కుక్క చనిపోతే, దానికి నరేంద్ర మోదీ ఎందుకు స్పందించాలని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 
 
కాంగ్రెస్ పార్టీ హయాంలో కర్ణాటకలో రెండు, మహారాష్ట్రలో రెండు హత్యలు జరిగాయని.. అప్పుడెవరూ కాంగ్రెస్‌ను తప్పుబట్టలేదని.. కానీ కర్ణాటకలో ఓ కుక్క చనిపోతే మాత్రం అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ప్రమోద్ ముథాలిక్ మాటలు వినగానే కార్యకర్తలు కొందరు జై శ్రీరాం అంటూ పెద్ద ఎత్తున నినదించారు. 
 
అయితే ప్రమోద్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో.. ఆయన కాస్త వెనక్కి తగ్గారు. కర్ణాటకలో జరిగే ప్రతీ హత్యకు మోదీ స్పందించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే అలా అన్నానన్నారు. లంకేశ్‌ను నేరుగా కుక్క అని ప్రస్తావించలేదని వివరణ ఇచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments