Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అతినీచమైన - హేయమైన చర్య : చిన్నారి నాగవైష్ణవి కేసులో తుది తీర్పు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో గురువారం తుదితీర్పు వెల్లడైంది. ఈ కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ విజయవాడ కోర్టు తీర్పు ఇచ్చింది. కేసులో ప్రధా

అతినీచమైన - హేయమైన చర్య : చిన్నారి నాగవైష్ణవి కేసులో తుది తీర్పు
, గురువారం, 14 జూన్ 2018 (14:30 IST)
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో గురువారం తుదితీర్పు వెల్లడైంది. ఈ కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ విజయవాడ కోర్టు తీర్పు ఇచ్చింది. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మోర్ల శ్రీనివాసరావు(ఏ-1), జగదీష్ (ఏ-2), పలగాని ప్రభాకర్‌రావు (ఏ-3)లను దోషులుగా తేల్చింది.
 
ఈ ముగ్గురికి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసు తుదితీర్పు సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖఅయలు చేశారు. అతినీచమైన, హేయమైన చర్యగా న్యాయమూర్తి అభివర్ణించారు. హత్య, కిడ్నాప్‌ కింద నేరాలు రుజువైనట్టు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. 
 
బీసీ సంఘం నేత, మద్యం వ్యాపారి పలగాని ప్రభాకర్‌ తన అక్క కుమార్తె వెంకటరామమ్మను పెళ్లి చేసుకున్నడాు. వీరికి దుర్గాప్రసాద్‌ అనే కుమారుడు ఉన్నాడు. అయితే, ఆ తర్వాత ప్రభాకర్ నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నర్మదను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు సాయితేజష్‌, నాగవైష్టవి సంతానం. పాప వైష్టవి పుట్టిన తర్వాతే తన దశ తిరిగిందన్నది ప్రభాకర్‌ నమ్మకం. 
 
గారాలపట్టి వైష్టవి పేరుతో ఆస్తులన్నీ పెడుతున్నాడన్న భావన మొదటి భార్య సోదరుడు పంది వెంకటరావులో బలంగా ఏర్పడింది. దీంతో వైష్ణవిని చంపాలని నిర్ణయించుకున్న వెంకటరావు, తన చిన్నమ్మ కొడుకు శ్రీనివాసరావుతో కోటి రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడు. 2010 జనవరి 30న చిన్నారి వైష్ణవిని కిడ్నాప్‌ చేసి చంపేశారు. తర్వాత ఆమె శవాన్ని బాయిలర్‌లో వేసి బూడిద చేశారు. 
 
దీనిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతూ వచ్చిన ఈ కేసు విచారణ ముగియడంతో కోర్టు తీర్పునిచ్చింది. అయితే, ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీల్ చేయనున్నట్టు ముద్దాయిల తరపు న్యాయవాది వెల్లడించారు. 
 
కాగా, తన గారాలపట్టి నాగవైష్ణవి హత్య వార్త విని తండ్రి పలగాని ప్రభాకర్ గుండెపోటుతో చనిపోయారు. తర్వాత కేసు విచారణ ఆలస్యమవుతూ వస్తూ ఉండటంతో నాగవైష్ణవి తల్లి కూడా మరణించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూన్ 17న ఫాదర్స్ డే.. అలుపెరగని రథసారథి.. సైనికుడు నాన్న..