Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలికలపై లైంగికదాడికి పాల్పడితే ఉరిశిక్షే : మేనకా గాంధీ ప్రతిపాదన

కేంద్ర మంత్రి మేనకా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో 12 యేళ్లలోపు బాలికలపై లైంగికదాడికి పాల్పడేవారికి ఉరిశిక్ష విధించాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ మేరకు పోస్కో చట్టంలో మార్పులు చేయాలని ఆమె

Advertiesment
Kathua rape-murder case
, శనివారం, 14 ఏప్రియల్ 2018 (13:26 IST)
కేంద్ర మంత్రి మేనకా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో 12 యేళ్లలోపు బాలికలపై లైంగికదాడికి పాల్పడేవారికి ఉరిశిక్ష విధించాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ మేరకు పోస్కో చట్టంలో మార్పులు చేయాలని ఆమె కోరారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కఠువా గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికను జనవరి 10న అపహరించిన కొందరు దుడంగులు పాశవికంగా అత్యాచారం చేసి, ఆపై హత్య చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.
 
ఈ పథ్యంలో 12 ఏళ్లలోపు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడివారికి మరణశిక్ష విధించేలా 'పోక్సో చట్టం'లో మార్పులు చేయాలని కేంద్ర మంత్రి మేనకా గాంధీ సూచించారని తెలుస్తోంది. 'పోక్సో చట్టం'లో మార్పులు చేస్తూ, నిబంధనావళిని ఖరారు చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ఉన్న పోస్కో చట్టం ప్రకారం చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి గరిష్టంగా జీవితఖైదు మాత్రమే విధించగలరు. 
 
మరోవైపు కఠువా కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును నిరసిస్తూ హిందూ ఏక్తా మంచ్ మార్చి4వ తేదీన నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న బీజేపీకి చెందిన ఇద్దరు రాష్ట్ర మంత్రులు రాజీనామా చేశారు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. చౌదరీలాల్ సింగ్, చంద్రప్రకాశ్ గంగా తమ రాజీనామాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సత్‌శర్మకు పంపారు.
 
ఇంకోవైపు, ఈ కేసులో స్వీయ విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు కూడా ముందుకు వచ్చింది. కఠువా దారుణానికి సంబంధించిన వివరాలను న్యాయవాదులు ఈనెల 18వ తేదీలోగా లిఖితపూర్వకంగా సమర్పిస్తే విచారణకు సిద్ధమేనని ప్రకటించింది. నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు కాకుండా కఠువా జిల్లా బార్ అసోసియేషన్, జమ్మూకాశ్మీర్ హైకోర్టు బార్ అసోసియేషన్ అడ్డుకున్నాయంటూ వస్తున్న ఆరోపణలపైనా అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని మోడీని దూషించినా.. వ్యతిరేక పాట పాడినా చేతులకు సంకెళ్లే...