Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూన్ 17న ఫాదర్స్ డే.. అలుపెరగని రథసారథి.. సైనికుడు నాన్న..

నాన్న అంటే బాధ్యతకు ప్రతిరూపం. నాన్నంటే భద్రత, భరోసా. అమ్మ పరిచయం చేసిన మొదటి వ్యక్తి నాన్న. అలాంటి నాన్నకు కృతజ్ఞతలు తెలిపే రోజే ఫాదర్స్ డే. ఈ ఫాదర్స్ డేను ప్రపంచ వ్యాప్తంగా జూన్ 17న జరుపుకోనున్నారు.

జూన్ 17న ఫాదర్స్ డే.. అలుపెరగని రథసారథి.. సైనికుడు నాన్న..
, గురువారం, 14 జూన్ 2018 (13:41 IST)
నాన్న అంటే బాధ్యతకు ప్రతిరూపం. నాన్నంటే భద్రత, భరోసా. అమ్మ పరిచయం చేసిన మొదటి వ్యక్తి నాన్న. అలాంటి నాన్నకు కృతజ్ఞతలు తెలిపే రోజే ఫాదర్స్ డే. ఈ ఫాదర్స్ డేను ప్రపంచ వ్యాప్తంగా జూన్ 17న జరుపుకోనున్నారు. చిన్నారులు ఆప్యాయంగా ఫాదర్స్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. కానుకలిచ్చేందుకు సిద్ధపడుతున్నారు.


నడిపించే దైవమైన నాన్న.. తన కన్నబిడ్డల అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమించే సైనికుడు. తనకంటే తన బిడ్డను గొప్పవాడిగా తీర్చిదిద్దేందుకు తన భుజాలను ఆసరాగా ఇచ్చి పైకి ఎదగాలని కోరుకుంటాడు. నాన్న త్యాగానికి మారుపేరు. 
 
పిల్లలను మంచి పౌరులుగా మార్చడమే ఆయన లక్ష్యం. లక్ష్యసాధనలో అతడు తన జీవితాన్ని సమిధగా చేస్తాడు. ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే, తన బిడ్డల్ని గమ్యాన్ని చేర్చేందుకు ముందుకు సాగే అలుపెరగని రథసారథి తండ్రి. తన బిడ్డ ఒక్కో మెట్టు ఎక్కి ఉన్నత స్థానం చేరేందుకు తను నిచ్చెనై నిలబడతాడు. 
 
అల్లారుముద్దుగా పెంచి ఆటపాటలతో పాటుగా, ఆత్మస్థైర్యమూ నేర్పిస్తాడు. బడిలో గురువులు పాఠాలు నేర్పిస్తే బతుకు పోరాటం నేర్పించే గురువు. బిడ్డల లోపాలు సరిచేసి వారి భవితకు చక్కటి పునాది వేస్తాడు. తాను వెనకుండి, తన బిడ్డల్ని విజయపథంవైపు నడిపిస్తాడు. అలాంటి నాన్నకు.. పితృదేవోభవ అని స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలుపుదాం.. హ్యాపీ ఫాదర్స్ డే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అడిగినా చెప్పొద్దు... అది లేకుండానే సిమ్ తీసుకోండి...