Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముప్పు తప్పించుకున్న ప్రజ్ఞాన్ రోవర్ - ఫోటోలు విడుదల చేసిన ఇస్రో

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (13:06 IST)
చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ తృటిలో ముప్పు తప్పించుకుంది. తాను ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న పెద్ద గోతిలో పడే ప్రమాదం నుంచి తప్పింది. ఇస్రో శాస్త్రవేత్తల సూచనలతో ప్రజ్ఞాన్ రోవర్ తన దారి మార్చుకుంది. ఈ గోతితో పాటు ప్రజ్ఞాన్ రోవర్ దారి మళ్లిన దానికి సంబంధించిన ఫోటోలను ఇస్రో రిలీజ్ చేసింది. చంద్రమండలంలో 4 మీటర్ల లోతైన గొయ్యిని గుర్తించిన రోవర్‌ను అప్రమత్తం చేసిన ఇస్రో.. గొయ్యికి మూడు మీటర్ల ఇవతలి నుంచే రూటు మార్చుకుని సురక్షిత మార్గంలో ముందుకుసాగింది. 
 
ఈ ప్రజ్ఞాన్ రోవర్‌కు అమర్చిన సెన్సార్ కెమెరాలు ఈ గొయ్యిని గుర్తించాయి ఇస్రోను అలెర్ట్ చేశాయి. దీంతో గొయ్యి మరో 3 మీటర్ల దూరంలో ఉందనగా ఇస్రో గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి రోవర్‌కు సంకేతాలు పంపింది. ఆ వెంటనే రోవర్ తన దారి మార్చుకుని సురక్షిత మార్గంలో ప్రయాణించింది. ఈ ఘటన సోమవారం జరిగింది. ఈ మేరకు రోవర్ గమనానికి సంబంధించిన రెండు ఫోటోలను ఇస్రో మీడియాకు రిలీజ్ చేసింది. అందులో ఒకటి గొయ్యి ఉన్న ప్రాంతం కాగా, మరొకటి రోవర్ వెళుతున్న కొత్త దారిని చూడొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిల్క్ బ్యూటీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఏంటది?

నిద్రమాత్రలు మింగిన గాయని కల్పన ఆరోగ్యం ఎలావుంది? (Video)

ప్లీజ్ అలా పిలవొద్దంటున్న అగ్ర హీరోయిన్!!

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments