ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదని.. నిండు గర్భవతిని..?

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (12:38 IST)
నిండు గర్భవతి అని కనికరం లేకుండా తల్లిదండ్రులు ఆమెను మట్టుబెట్టారు. ఈ దారుణమైన ఘటన యూపీలో చోటుచేసుకుంది. ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదని తల్లిదండ్రులు ఆమెను కర్కశంగా చంపేశారు. వివరాల్లోకి వెళితే.. యూపీ, ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ 19ఏళ్ల యువతి రాహుల్ అనే యువకుడిని ప్రేమించింది. 
 
ప్రియుడి కోసం 2022 అక్టోబర్‌లో ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడిపై కిడ్నాప్, రేప్ కేసులు పెట్టింది. దీంతో ప్రియుడిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కేసు విచారణ కోర్టులో జరుగుతూ వుంది. అయితే తల్లిదండ్రుల వద్దకు రావడానికి ముందు కూతురు గర్భం దాల్చింది. 
 
అయినప్పటికీ రాహుల్‌కు శిక్ష పడాలని యువతి తల్లిదండ్రులు ప్రయత్నించారు. దీనికోసం ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని తమ కూతురుని పలుమార్లు బలవంతం చేశారు. దీని కోసం ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి నిరాకరించింది. దీంతో ఆవేశంతో ఆ తల్లిదండ్రులు కూతురి గొంతు నులిమి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గర్భిణీ తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం