Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం: పది కిలోల చొప్పున ఉచిత బియ్యం

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (12:54 IST)
కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం కింద ఉచిత కోటా కేటాయిస్తూ అమలు చేస్తోంది. ఆహార భద్రత కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం కోటా కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు కలిపి పది కిలోల చొప్పున అందిస్తూ వస్తోంది. 
 
ఉచితం బియ్యం పథకం కాలపరిమితి మార్చి కోటాతో ముగియడంతో కేంద్రం మరోసారి సెప్టెంబర్‌ వరకు పథకాన్ని పొడిగించింది. అయితే ప్రభుత్వ చౌకధరల దుకణాల ద్వారా ఏప్రిల్, మే, జూన్‌న్‌ నెలల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ సాధ్యం కాలేదు. 
 
రూపాయి కిలో చొప్పున అందించారు. అయితే గత నెల చివర్లో మాత్రం నెలసరి కోటా పంపిణి గడువు ముగియగానే యూనిట్‌కు ఐదు కిలోల చొప్పున అందించింది. ఈ నెలలో మాత్రం పది కిలోల చొప్పున పంపిణీ చేయనుంది.
 
ఆహార భద్రత (రేషన్‌) కార్డు కలిగిన కుటుంబాలకు ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా యూనిట్‌కు పది కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ కానుంది.
 
ఈ నెల ఐదు నుంచి ఉచిత బియ్యం కోటా పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి వెల్లడించారు. కోవిడ్‌ నేపథ్యంలో పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ మధ్యలో రెండు నెలలు నిలిచిపోగా, గత నెల చివర్లో నెల సరి కోటాతో సంబంధం లేకుండా యూనిట్‌కు ఐదు కిలోల చొప్పున ఉచితంగా అదించారు.
 
ఈ నెలలో మాత్రం పాత పద్ధతిలోనే యూనిట్‌కు పది కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. కార్డులో ఎన్ని యూనిట్లుంటే అన్ని పదికిలోల చొప్పన పంపిణీ చేస్తారు. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా నెలసరి ఉచిత కోటా ఈ నెల 29 వరకు డ్రా చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments