Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురుగు కాలువలో దిగి నిరసన తెలిపిన వైకాపా ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (12:48 IST)
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని ఉమ్మారెడ్డి గుంటలో వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిరసనకు దిగారు. మురుగు కాల్వ ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని గత కొంతకాలంగా ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. 
 
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాల్వలోకి దిగి నిరసన తెలిపారు. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నప్పటికీ వంతెన నిర్మాణం జరగలేదని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ క్రమంలో మరోసారి కాల్వలో దిగి నిరసన తెలిపిన కోటంరెడ్డి.. రైల్వే, నగర కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షమైనా, అధికారపక్షమైనా సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తానన్నారు. ఎప్పటిలోపు పనుల ప్రారంభిస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని.. అంతవరకు కాల్వ వద్ద నుంచి కదలబోనని స్పష్టం చేశారు. 
 
ఇచ్చిన గడువులోపు సమస్య పరిష్కారం కాకపోతే మురుగునీటిలోనే పడుకుంటానని చెప్పారు. దీంతో అధికారులు ఈనెల 15న నిర్మాణ పనులు ప్రారంభించి వచ్చే నెల 15లోపు పూర్తిచేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. అనంతరం కోటంరెడ్డి తన నిరసనను విరమించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి ప్రీ రిలీజ్- బాధతో అల్లాడిపోయిన ప్రభాస్.. కాలి గాయం తగ్గలేదా? (video)

వరల్డ్ కప్ సెమీఫైనల్‌తో కల్కి పోటీ పడుతుందా? అదో తలనొప్పి!

విజువల్ ఫీస్ట్ లా కన్నప్ప టీజర్

'కల్కీ' బాక్సాఫీసు టార్గెట్ ఎంతంటే..!!

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments