Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రొఫెసర్‌గా అవతారం ఎత్తనున్న మన్మోహన్ సింగ్.. పంజాబ్ వర్శిటీలో..?

పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం ద్వారా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మళ్లీ ప్రొఫెసర్ అవతారం ఎత్తనున్నారు. తాను చదువుకున్న పంజాబ్ యూనివర్శిటీలో

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (12:04 IST)
పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం ద్వారా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మళ్లీ ప్రొఫెసర్ అవతారం ఎత్తనున్నారు. తాను చదువుకున్న పంజాబ్ యూనివర్శిటీలోనే ఒక ప్రతిష్టాత్మక బాధ్యతను ఆయన చేపట్టబోతున్నారు. పూర్వ విద్యార్థిగా, పూర్వ అధ్యాపకుడిగా పంజాబ్ వర్శిటీ నుంచి మన్మోహన్‌కు ఆహ్వానం వచ్చింది.
 
జులైలో మన్మోహన్ సింగ్ నేరుగా రాజ్యసభ చైర్మన్‌ను సంప్రదించారు. లాభదాయక పదవులను చేపట్టడం వల్ల రాజ్యసభ సభ్యుడిగా తాను అనర్హతకు గురవుతానా అనే అనుమానం వ్యక్తం చేస్తూ సలహా కోరారు. రాజ్యంగ అధికరణం 102(1ఏ) కింద అనర్హత వేటు పడే అవకాశం ఉందా అని తెలుసుకోగోరారు. 
 
మన్మోహన్ సింగ్ అసోం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మన్మోహన్ జులైలో రాజ్యసభ చైర్మన్‌ను సంప్రదించిన నేపథ్యంలో సంబంధిత సంయుక్త సంఘం ఈ నెల 14న లోక్‌సభ స్పీకర్‌కు తన నివేదికను సమర్పించింది. పంజాబ్ వర్శిటీ ఇచ్చిన అవకాశాన్ని మన్మోహన్ సింగ్ వినియోగించుకుంటే ఎలాంటి అనర్హత సమస్య ఉండదని ఆ నివేదిక స్పష్టం చేసింది. దీంతో మన్మోహన్ సింగ్ త్వరలో పంతులుగా అవతారం ఎత్తనున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments