ఏడేళ్ల బాలికపై 45 ఏళ్ల కానిస్టేబుల్ అత్యాచార యత్నం

ఉత్తరప్రదేశ్‌లో 45 ఏళ్ల కానిస్టేబుల్ స్థానికంగా నివశిస్తున్న ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడు. వివరాల్లోకి వెళితే... గౌతమ్ బుధ్ నగర్‌లో సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే సుభాష్ సింగ్ అనే కానిస్టేబుల్ గ్రేటర్ నోయిడాలోని సురజ్‌పూర్‌లో బు

Webdunia
శుక్రవారం, 12 జనవరి 2018 (20:04 IST)
ఉత్తరప్రదేశ్‌లో 45 ఏళ్ల కానిస్టేబుల్ స్థానికంగా నివశిస్తున్న ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడు. వివరాల్లోకి వెళితే... గౌతమ్ బుధ్ నగర్‌లో సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే సుభాష్ సింగ్ అనే కానిస్టేబుల్ గ్రేటర్ నోయిడాలోని సురజ్‌పూర్‌లో బుధవారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలు, నేరస్తుడు ప్రక్కప్రక్కన భవనాలలో నివశిస్తున్నారు. బాలిక తల్లి ఫ్యాక్టరీలో కార్మికురాలిగా పనిచేస్తోంది.
 
బాలికను అతను అపార్ట్‌మెంట్‌లోకి బలవంతంగా తీసుకెళ్లాడని, అప్పుడు ఆమె అరుపులు చుట్టుప్రక్కల వారికి వినిపించాయని, స్థానికులు బాలికను రక్షించి అతడిని ముట్టడించే లోపల నిందితుడు పారిపోయాడు. అతను 4 గంటలకు తిరిగి వచ్చినప్పుడు ఇద్దరు ఆడవాళ్లు అలారం మోగించారు. స్థానికులు ప్రతిస్పందించి అతనిపై బూట్లు, చెప్పులు విసిరారు. తదుపరి పోలీసులకు అప్పగించారు.
 
బాలికను అతడు అరగంట సేపు నిర్భందించాడని సమాచారం. నిందితునిపై POCSO చట్టం క్రింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం నోయిడాలో సెక్టార్ 30 జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments