సంతానం లేని మహిళలు ఎండుద్రాక్షలు తింటే?
ఎండు ద్రాక్షలను రోజూ గుప్పెడు తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండుద్రాక్షలను తరచూ తీసుకోవడం ద్వారా శరీరంలోని ఆమ్లాలు తొలగిపోతాయి. జ్వరం, జలుబు, దగ్గు నయం అవుతుంది.
ఎండు ద్రాక్షలను రోజూ గుప్పెడు తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండుద్రాక్షలను తరచూ తీసుకోవడం ద్వారా శరీరంలోని ఆమ్లాలు తొలగిపోతాయి. జ్వరం, జలుబు, దగ్గు నయం అవుతుంది. సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్ పండ్లు తింటే అండాశయంలోని లోపాలు తొలగిపోయి సంతానం కలుగుతుంది.
మహిళలు నిత్యం ఎండుద్రాక్షలను తీసుకుంటే మూత్రాశయంలో అమోనియా పెరగదు. తద్వారా రాళ్లు కూడా ఏర్పడవు. ఎండు ద్రాక్షలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీని వల్ల ఇవి రక్తహీనతకు మంచి మందుగా పనిచేస్తాయి. మహిళలకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి. ఎండు ద్రాక్షల్లోని కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. దంత సమస్యలను ఇవి దూరం చేస్తాయి.
పిల్లలు రాత్రి పూట పక్క తడుపుతుంటే వారికి వారం పాటు ప్రతి రోజూ రాత్రి పూట కొన్ని ఎండుద్రాక్షలు ఇవ్వడం చేయాలి. ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీటిలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.