సిగరెట్ వ్యాపారులను దోచుకున్నారు... ఎవరు?

Webdunia
గురువారం, 14 మే 2020 (15:53 IST)
తప్పు చేస్తే శిక్ష విధించాల్సిన పోలీసులే అక్రమానికి పాల్పడితే ఏం చేయాలి? కరోనా లాక్‌డౌన్‌ని అడ్డుపెట్టుకుని వ్యాపారుల నుండి కోట్ల రూపాయలు బలవంతంగా గుంజారు. సిగరెట్ వ్యాపారుల నుంచి సుమారు రూ.1.75 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు బెంగళూరు సీసీబీ ఏసీపీ ప్రభుశంకర్, ఇన్‌స్పెక్టర్లు నిరంజన్, అజయ్‌లపై ఆరోపణలు వచ్చాయి. 
 
ఇలా డిస్ట్రిబ్యూటర్ల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసిన విషయం డీజీపీ దృష్టికెళ్లింది. ఆయన ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ జరపగా ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో కేసు నమోదైంది. పోలీసు అధికారుల నుంచి రూ.52 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. 
 
ప్రాథమిక విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆ మేరకు డీజీపీకి నివేదిక అందజేశారు. నిందితులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసును స్వతంత్ర సంస్థ ద్వారా విచారణ జరిపించాలని పోలీసు ఉన్నతాధికార వర్గాలు యోచిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments