Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్లపైకి రావొద్దని చెప్పినందుకు ఏఎస్ఐ చేతి నరికేశారు...

Webdunia
ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (15:57 IST)
లాక్‌డౌన్ సమయంలో రోడ్లపైకి రావొద్దంటూ సూచనలు చేసిన ఏఎస్ఐ చేతిని నరికేశారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలలో జరిగింది. మండీ బ‌జార్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాన్ని పరిశీలిస్తే, కర్ఫ్యూ నడుస్తున్నందున పాసులు చూపించాలని యువకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యువకులు అక్కడ ఏర్పాటు చేసిన బారికేట్లను జీపుతో గుద్దుకుంటూ వెళ్లిపోయారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై కత్తులతో దాడికిపాల్పడ్డారు. 
 
ఈ దాడిలో ఏఎస్‌ఐ చేతు పూర్తిగా తెగిపోయింది. మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన చండీఘడ్‌లోని పీజీఐఎంఆర్‌ ఆస్పత్రికి తరలించారు. ఏఎస్‌ఐ హర్జిత్‌ సింగ్‌ చేతికి సర్జరీ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులందరిని గుర్తించామని, నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఎస్పీ హెచ్చరించారు. 
 
అంతేకాకుండా, నిందితుల అరెస్టు కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు వేగంగా స్పందింస్తూ, దాడికి పాల్పడిన ఏడుగురిని అరెస్టు చేశారు. ఓ ప్రార్థనా మందిరం నుంచి వారిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments