Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను తల్లిని కావాలనుకుంటున్నాను... నా భర్తకు పెరోల్ మంజూరు చేయండి..

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (08:24 IST)
నేను తల్లిని కావాలనుకుంటున్నాను.. అందువల్ల నా భర్తకు పెరోల్ మంజూరు చేయాలంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై రాజస్థాన్ కోర్టు సానుకూలంగా స్పందించింది. అత్యాచారం కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న ముద్దాయికి భార్యను తల్లిని చేసేందుకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాహుల్ (25) అనే వ్యక్తి ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో అతనికి 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ముద్దాయిని జైలుకు తరలించారు. 
 
ఈ క్రమంలో తాను తల్లిని కావాలనుకుంటున్నానని, తన భర్తకు పెరోల్ మంజూరు చేయాలని రాహుల్ భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు సందీప్ మెహతా, సమీర్ జైన్‌లతో కూడిన ధర్మాసనం 15 రోజుల పాటు పెరోల్ మంజూరు చేసింది. భర్త లేకుండా, భర్త నుంచి పిల్లలు కలగకుండా ఉండే పరిస్థితుల్లో ఆమె జీవించకూడదని కోర్టు స్పష్టంచేసింది. 
 
ఆమె తన వంశ పరిరక్షణ కోసమే ఈ పిటిషన్‌ను దాఖలు చేసిందని, ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తే ఆమె హక్కులను కాలరాసినట్టే అవుతుందని అభిప్రాయపడిన ధర్మాసనం... ముద్దాయికి 15 రోజుల పెరోల్ మంజూరుచేసింది. రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు లక్ష రూపాయల చొప్పున రెండు జామీను బాండ్లు సమర్పించి పెరోల్ పొందొచ్చని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments