Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక కాంగ్రెస్ పార్టీలో ఉడుకు రక్తమే : రాహుల్ గాంధీ

ఇక కాంగ్రెస్ పార్టీలో ఉడుకు రక్తమే ఉంటుందని ఆ పార్టీ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆయన పార్టీ అధినేతగా శనివారం బాధ్యతలు స్వీకరించారు.

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (15:28 IST)
ఇక కాంగ్రెస్ పార్టీలో ఉడుకు రక్తమే ఉంటుందని ఆ పార్టీ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆయన పార్టీ అధినేతగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ కార్యకర్తలను సోదరులుగా భావిస్తున్నామని.. అయితే వారి సిద్ధాంతాలను విభేదిస్తామన్నారు. ఒక సారి నిప్పు రాజేస్తే.. దాన్ని అదుపు చేయడం చాలా కష్టమవుతుందనీ… బీజేపీకి అది అర్థం కావడం లేదన్నారు. 
 
కార్యకర్తలందరూ.. తన కుటుంబ సభ్యులే అన్నారు. యువకులు కావొచ్చు… పెద్దలు కావొచ్చు.. వారందరూ తనవాళ్లన్నారు. “మిమ్మల్నిందరి నేను అభిమానిస్తున్నాను. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ను… రాబోయే రోజుల్లో గ్రాండ్ ఓల్డ్ అండ్ యంగ్ పార్టీగా మారుద్దాం. నన్ను మీ సోదరుడిగా భావించండి.. మాతో చేతులు కలపండి” అని పిలుపునిచ్చారు. 
 
దేశంలో ప్రతి గ్రామానికి.. ప్రతి నగరానికి వెళదామన్నారు. గ్రామగ్రామాన కార్యకర్తలను రక్షించుకోవడం తన బాధ్యతన్నారు. కాంగ్రెస్ లేకుండా చేయాలని బీజేపీ భావిస్తోంది. తుడిచిపెట్టేయాలని చూస్తోంది. నిప్పును నిప్పుతో కొట్టాలని కాంగ్రెస్ భావించడంలేదు. ప్రేమతో … బాధ్యతతో గెలవాలని చూస్తోందన్నారు. 
 
పెద్దల నుంచి నేర్చుకోవడానికి ఎప్పుడూ ముందుంటానన్న ఆయన… తనకు అమూల్యమైన సలహాలిచ్చిన మన్మోహన్, సోనియాగాంధీ, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలు ప్రజాసేవకు ఉపయుక్తంగా లేకుండా ఉన్నాయని, రాజకీయ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల మధ్య బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోందని, ఒకసారి విద్వేషాలు చెలరేగితే అణచివేయడం చాలా కష్టమని రాహుల్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments