అమెరికాలో మరో రికార్డు సృష్టించనున్న ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (14:21 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో మరో రికార్డు సృష్టించనున్నారు. ఈ నెల 22వ తేదీన అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ మేరకు వైట్ హౌస్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ తదితరలు ఆహ్వానం పంపించారు. దీనికి ప్రధాని మోడీ సైతం ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఆహ్వానం తనకెంతో గర్వకారణంగా ఉందని చెప్పారు. దీంతో ప్రధాని మోడీ అమెరికా కాంగ్రెస్‌లో రెండుసార్లు ప్రసంగించిన భారత ప్రధానిగా నరేంద్ర మోడీ అమెరికాలో రికార్డు సృష్టించనున్నారు.
 
కాగా, ఈ నెల 22వ తేదీన ప్రధాని మోడీ అమెరికా ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. భారత దేశ భవిష్యత్ కార్యాచరణ, ఇరు దేశాలు ఉమ్మడిగా ఎదుర్కొంటున్న సవాళ్ళు తదితర అంశాలపై ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఓ అధికారిక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
కాగా, మోడీకి ఇది రెండో అధికారిక అమెరికా పర్యటన. 2016 జూన్‌లో ఆయన తొలిసారిగా అగ్రరాజ్యంలో పర్యటించారు. ఇప్పటివరకూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ మాత్రమే అమెరికా చట్టసభల్లో రెండు పర్యాయాలు ప్రసంగించారని భారత అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments