కోవిడ్‌ పరిస్థితులపై సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (11:00 IST)
కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తుగా అప్రమత్తమవుతోంది. 
 
దేశంలో కోవిడ్‌ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించనున్నారు.
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే కరోనా బెల్స్‌ను మోగించింది. ఈ క్రమంలో అన్ని దేశాలూ అప్రమత్తం అవుతున్నాయి. దేశంలోని కరోనా పరిస్థితులపై నేడు మోదీ చర్చించనున్నారు. 
 
ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ రాష్ట్రాలవారీగా కోవిడ్‌ వ్యాప్తి తీరుతెన్నులపై ఒక ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చర్యలపై ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. 
 
ఇక దేశంలో మంగళవారం మరో 2,483 కొత్త కోవిడ్‌ కేసులు నమోదవగా, 52 మరణాలు సంభవించాయి. కొత్త కేసుల్లో సగం ఢిల్లీలోనే బయటపడుతున్నాయి.
 
చైనాలోని షాంఘైలో గత 24 గంటల్లో మరో 52 మంది కరోనాతో చనిపోయారు. దీంతో గత 10 రోజుల్లో అక్కడ సంభవించిన కోవిడ్‌ మరణాల సంఖ్య 190కి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments