Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలెక్కిన మరో 9 వందే భారత్ రైళ్లు : విజయవాడ - చెన్నై టిక్కెట్ ధర ఎంతంటే...

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (16:39 IST)
దేశ వ్యాప్తంగా మరో తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆదివారం నుంచి పట్టాలెక్కాయి. ఈ రైళ్ల రెగ్యులర్ సర్వీసులు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. ఈ తొమ్మిది రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ రైళ్లలో తెలుగు రాష్ట్రాల్లో నడిచే రెండు రైళ్లు కూడా ఉన్నాయి. వీటిలో ఒకటి కాచిగూడ - యశ్వంత్‌పూర్, విజయవాడ - చెన్నై ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైళ్లు ఉన్నాయి. కాగా, ఢిల్లీలో వర్చువల్ విధానంలో ప్రధాని మోడీ జెండా ఊపి ఈ రైళ్ళను ప్రారంభించగా, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో జరిగిన వందే భారత్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 
 
కొత్తగా పట్టాలెక్కిన తొమ్మిది వందే భారత్ రైళ్లలో ఉదయ్‌పూర్ - జైపూర్, తిరునల్వేలి - మదురై - చెన్నై ఎగ్మోర్, హైదరాబాద్ -  బెంగుళూరు, విజయవాడ - చెన్నై (వయా రేణిగుంట), పాట్నా- హౌరా, కాసర్‌గాడ్ - తిరునల్వేలి, రూర్కెలా - భువనేశ్వర్ - పూరి, రాంచీ - హౌరా, జామ్ నగర్ - అహ్మదాబాద్ రైళ్లు ఉన్నాయి. ఇవి రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, బీహార్, వెస్ట్ బెంగాల్, కేరళ, ఒరిస్సా, జార్ఖండ్, గుజరాత్ సహా మొత్తం 11 రాష్ట్రల మధ్య నడుస్తాయి. 
 
అయితే, చెన్నై -  విజయవాడల ప్రాంతాల మధ్య నడిచే రైలు మాత్రం చెన్నైలో ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకు బయలుదేరి రేణిగుంట, నెల్లూరు,  ఒంగోలు, తెనాలి మీదుగా విజయవాడకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడలో సాయంత్రం 3.10 గంటలకు బయలుదేరి చెన్నైకు రాత్రి 11 గంటలకు వచ్చి చేరుతుంది. 20677, 20678 నంబర్లతో నడిచే ఈ రైలులో మొత్తం ఎనిమిది బోగీలు ఉంటాయి. వీటిలో ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటుంది. ప్రయాణ చార్జీ విజయవాడ నుంచి చెన్నైకు క్యాటరింగ్ చార్జీతో కలుపుకుని ఏసీ ఛైర్ కార్‌ చార్జీ రూ.1420, ఎగ్జిక్యూటివ్ క్లాస్ చార్జీ రూ.2630గా ఉంది. 
 
అలాగే, చెన్నై నుంచి విజయవాడకు క్యాటరింగ్ చార్జీతో కలుపుకుని ఏసీ ఛైర్‌కార్ చార్జీతో కలుపుకుని చార్జీ రూ.1320, ఎగ్జిక్యూటివ్ క్లాస్ చార్జీ రూ.2540గా ఉంది. క్యాటరింగ్ చార్జ్ మినహాయిస్తే మాత్రం టిక్కెట్ ధరలో రూ.140 మేరకు తగ్గుతుంది. అయితే, చెన్నై - విజయవాడ ప్రాంతాల మధ్య నడిచే అన్ని రైళ్లు గూడూరు మీదుగా చెన్నైకు వస్తాయి. కానీ, ఈ వందే భారత్ రైలు మాత్రం రేణిగుంట మీదుగా చెన్నైకు నడుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

దివ్యప్రభ న్యూడ్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్... పాపులారిటీ కోసమేనా (Video)

తుదిదశలో 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' షూటింగ్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments