ప్రజల హృదయాలను గెలుచుకున్న లెజండరీ నటుడు...

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (13:48 IST)
ప్రజల హృదయాలను గెలుచుకున్న లెజండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొనియాడారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. ఆయన మృతి తనను ఎంతో ఆవేదనకు గురి చేస్తుందన్నారు. 
 
ఇదే విషయంపై ప్రధాని మోడీ విడుదల చేసిన సంతాప సందేశంలో "కృష్ణగారు తన అద్భుత నటా కౌశలంతో, ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజండరీ సూపర్ స్టార్. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు. ఈ విషాదకర సమయంలో మహేశ్ బాబుకు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి'' అంటూ పేర్కొన్నారు. 
 
అలాగే రాహుల్ గాంధీ స్పందిస్తూ, "తెలుగు సినిమా సూపర్ స్టార్ ఘట్టమనేని  కృష్ణగారు మరణించారనే వార్తతో చాలా ఆవేదనకు గురయ్యానని చెప్పారు. ప్రజా జీవితంలో ఎలా ఉండాలనే దానికి ఆయన వృత్తిపరమైన క్రమశిక్షణ, విలువలు ఒక ఉదాహరణంగా నిలిచిపోతాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments