Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెన్సీ నోట్ల రద్దు... తుగ్లక్ నిర్ణయాలు : సుప్రీంకోర్టులో పిటీషన్

దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం తుగ్లక్ నిర్ణయంతో పలువురు పోల్చుతున్నారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో సైతం ఓ పిటీషన్ దాఖలైంది. ఈ నోట్లను రద్దు చే

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (13:52 IST)
దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం తుగ్లక్ నిర్ణయంతో పలువురు పోల్చుతున్నారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో సైతం ఓ పిటీషన్ దాఖలైంది. ఈ నోట్లను రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని ఇందులో కోరారు. ఈ మేరకు బుధవారం ఓ పిటీషన్ దాఖలైంది. 
 
కనీస సమయం ఇవ్వకుండా రాత్రికిరాత్రి కరెన్సీ నోట్లను రద్దు చేయడంతో సామాన్య పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ సుప్రీంకోర్టు న్యాయవాది సంగం లాల్ పాండే రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ‘తుగ్లక్ తీర్మానం’ అంటూ ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మధ్యయుగంలో భారత దేశాన్ని పరిపాలించిన మహ్మద్ బీన్ తుగ్లక్ ఢిల్లీ నుంచి రాజధానిని, కరెన్సీ మార్చాలని ప్రయత్నించడం... అవి బెడిసికొట్టడంతో ‘తుగ్లక్ నిర్ణయాలు’ అన్ని పదం ప్రాచుర్యంలోకి వచ్చాయని గుర్తు చేశారు.
 
'దేశంలోని పేద ప్రజలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ చట్ట వ్యతిరేక నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలి' అని పిటిషన్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. విద్యా వైద్య సంబంధిత అవసరాలతో పాటు పెళ్లిళ్లు, వ్యవసాయం వంటి పనులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు ప్రజలకు కొంత సమయం ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకు నివేదించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments