Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు చేరుకున్న ప్రధాని మోడీ - యూపీ సీఎంతో విందు

Webdunia
మంగళవారం, 17 మే 2022 (08:14 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన ఒక్క రోజు నేపాల్ పర్యటన ముగించుకుని తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా లుంబినిలోని మాయాదేవి ఆలయంలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బాతో కలిసి మోడీ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మోడీ, దేవ్‌ల సమక్షంలో భారత్, నేపాల్ దేశాల ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఆరు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, నేపాల్‌కు రాముడికి విడదీయరాని సంబంధం ఉందన్నారు. నేపాల్ లేకుంటే రాముడు అసంపూర్ణం అని వ్యాఖ్యానించారు. అయితే, బుద్ధుడు ఇరు దేశాలను కలుపుతున్నాడని, బుద్ధుడు రాజకీయ సరిహద్దులకు అతీతుడని, బుద్ధుడు ప్రతి ఒక్కరి వాడని చెప్పారు. 
 
ఇదిలావుంటే నేపాల్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోడీ లక్నోకు చేరుకున్నారు. అక్కడ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగినాథ్‌తో కలిసి విందులో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ రాష్ట్ర మంత్రులతో రాష్ట్ర పాలనపై చర్చించారు. ఆ తర్వాత యూపీ మంత్రివర్గంతో కలిసి ఆయన గ్రూపు ఫోటో దిగారు. కాగా, యూపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments