వైద్య కాలేజీ హాస్టల్‌ భవనంపై కూలిన విమానం - పలువురు విద్యార్థుల మృతి!!

ఠాగూర్
గురువారం, 12 జూన్ 2025 (16:38 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని ఎయిరిండియా విమానం ఓ వైద్య కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అలాగే, మరికొందరు గాయపడినట్టు సమాచారం. అహ్మదాబాద్ నగరంలోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే ఈ విమానం కుప్పకూలిపోయింది. 
 
విమానాశ్రయానికి సమీపంలోనే ఉన్న ఓ వైద్య కాలేజీ వసతి గృహం భవనంపై ఈ విమానం కూలిపోయింది. దీంతో హాస్టల్ భవనాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా, వంటగది పూర్తిగా దెబ్బతిన్నాయి. విమానం ప్రమాదానికి గురైన సమయంలో అందులో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఇద్దరు పైలెట్లు, పది మంది విమాన సిబ్బంది ఉన్నారు. కాగా, ఈ విమానంలో తన కుమార్తెను చూసేందుకు లండన్‌కు బయలుదేరిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్టు సమాచారం. 
 
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం : గుజరాత్ మాజీ సీఎం మృతి?
 
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందినట్టు తెలుస్తోంది. లండన్‌లో ఉన్న తన కుమార్తెను చూసేందుకు ఆయన అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లే ఎయిరిండియా విమానంలో బయలుదేరారు. ఈ విమానం విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్టు సమాచారం. 
 
ఈ విమానంలో విజయం రూపానీ పేరుతో ఓ టికెట్ తొలుత నెట్టింట వైరల్ అయింది. ఇందులో బోర్డింగ్ సమయం మధ్యాహ్నం 12.10 గంటలుగా ఉంది. ఆ తర్వాత విమానం ఎక్కినట్టు నిర్ధారించే ప్రయాణికుల జాబితాలోనూ రూపానీ కనిపించింది. లండన్‌లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు విజయ్ రూపానీ ఈ విమానంలో ప్రయాణానికి బుక్ చేసుకున్నట్టు జాతీయ మీడియా కథనాల సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments