Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురికి కాలువలో కరెన్సీ నోట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం

Webdunia
ఆదివారం, 7 మే 2023 (13:15 IST)
బీహార్ రాష్ట్రంలోని సానారామ్‌లోని ఓ మురికి కాలువలో కరెన్సీ నోట్లు కనిపించాయి. వీటిని చూడగానే ఏరుకునేందుకు జనం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మురికి కాలువలో రూ.100, రూ.10 నోట్లు కనిపించాయి. దీంతో స్థానికులు పోటీపడి నోట్లను దక్కించుకునేందుకు జనం పోటీపడుతున్నారు.  
 
కాలువలో కరెన్సీ నోట్లు తేలడంతో నీటి అడుగున్న నోట్ల కట్టలు ఉండొచ్చని జనం ఎగబడ్డారు. నీటిపైన తేలుతున్న నోట్లను ఏరుకోవడంతో పాటు అడుగున్న మట్టి, చెత్తలో గాలించారు. కొందరు అడుగున ఉన్న మట్టిని చేతులతో ఒడ్డుకు తెచ్చిమరీ కరెన్సీ నోట్ల కోసం వెతికారు. 
 
అయితే, ఆ కరెన్సీ నోట్లు నకిలీవి కావొచ్చని మరికొందరు స్థానికులు సందేహిస్తున్నారు. స్థానికుల సమాచారం అందించడంతో వెంటనే అక్కడకి చేరుకున్నామని, అయితే, కాలువలో తమకు కరెన్సీ నోట్లు ఏవీ కనిపించలేదని పోలీసులు చెప్పారు. ఇదంతా కేవలం పూకార్లు అయివుండొచ్చని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఘాటి నుంచి అనుష్క శెట్టి స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రివీల్

థగ్ లైఫ్ విజువల్ ఫీస్ట్ టీజర్‌తో రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

నవీన్ చంద్ర లెవెన్ చిత్రంలో శ్వేతా మోహన్ పాడిన లవ్లీ మెలోడీ సాంగ్

మ్యుజీషియన్ ప్రతీక్ కుహాద్ కిక్‌స్టార్ట్ ఇండియా రన్ ఆఫ్ సిల్హౌట్స్ టూర్ హైదరాబాద్‌లో

హీరో డల్ గా ఉంటే సెట్ మొత్తం డల్ గా ఉంటుంది, కానీ నాకు లక్కీ భాస్కర్ దొరికాడు : వెంకీ అట్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

తర్వాతి కథనం
Show comments