Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రీగా చికెన్ ఇవ్వలేదంటూ కోళ్లను చంపేశారు.. ఎక్కడ...?

Webdunia
సోమవారం, 1 జులై 2019 (18:39 IST)
ఇంట్లో పెంచుకుంటున్న కోళ్లను ఫ్రీగా ఇవ్వలేదని ఇద్దరు దుండగులు కోళ్లను చంపేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆదివారం నాడు చోటుచేసుకుంది.


ఝాన్సీ రోడ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో గుడ్డి భాయ్‌ అనే మహిళ తన కుమార్తెతో నివసిస్తూ జీవనాధారం కోసం కూలీగా పని చేస్తోంది. కూలీ డబ్బులతో ఇంటి అవసరాలు తీరకపోయే సరికి ఇంటి వద్దనే నాలుగైదు కోళ్లను పెంచుకుంటుంది. 
 
కోళ్లు పెట్టిన గుడ్లను అమ్ముకొని.. ఆ డబ్బుతో చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటుంది. ఆదివారం ఉదయం గుడ్డి భాయ్‌ ఇంట్లో లేని సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చి, ఫ్రీగా ఓ కోడిని ఇవ్వాలని ఆమె కూతురిని కోరారు. ఆమె తిరస్కరించంతో కోపగించుకున్న ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడున్న ఒక కోడి పుంజును చంపేశారు. మిగతా నాలుగు కోళ్లకు విషాహారం తినిపించారు. 
 
దీంతో ఒకేసారి ఐదు కోళ్లు చనిపోయాయి. చివరకు ఇంటికి చేరుకున్న గుడ్డి భాయ్ చనిపోయిన కోళ్లను తీసుకొని ఝాన్సీ రోడ్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లింది‌. కోళ్లను చంపేసిన సురేందర్‌, సుమర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments