మన్మోహన్ సింగ్‌కు మొండిచేయి చూపిన ఎంకే స్టాలిన్!

Webdunia
సోమవారం, 1 జులై 2019 (17:03 IST)
మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్‍కు డీఎంకే అధ్యక్షుడు ఎంకే.స్టాలిన్ మొండిచేయి చూపించారు. పైగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వినతిని కూడా తోసిపుచ్చారు.
 
మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగిసిపోయింది. దీంతో ఆయన్ను తమిళనాడు నుంచి రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఇందుకోసం మిత్రపక్షమైన డీఎంకేకు రాహుల్ విజ్ఞప్తి చేశారు. డీఎంకే కోటాలో ఉన్న మూడు రాజ్యసభ సీట్లలో ఒక్క సీటును మన్మోహన్ సింగ్‌కు కేటాయించాలని కోరారు. అయితే, రాహుల్ వినతిని స్టాలిన్ నిర్ద్వద్వంగా తోసిపుచ్చారు. 
 
పైగా, తమ పార్టీకి చెందిన ఇద్దరు నేతల పేర్లను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. వీరిలో ఒకరు న్యాయవాది విల్సన్ కాగా, మరొకరు సీనియర్ నేత షణ్ముగంలు ఉన్నారు. ఇంకోసీటును సంకీర్ణ భాగస్వామి వైకోకు ఇవ్వనున్నారు. 
 
డీఎంకే - ఎండీఎంకే పార్టీల మధ్య ఈ అవగాహన ఎన్నికలకు ముందే కుదిరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ద్వైవార్షిక కోటాలో ఖాళీ అయ్యే సీట్లలో భాగంగా ఈ రాష్ట్రం నుంచి 6 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో నాలుగు అధికార అన్నా డీఎంకే నాయకులు కాగా, ఒకరు డీఎంకే నుంచి, మరొకరు సీపీఐ సభ్యుల పదవీ కాలం ముగుస్తోంది. 
 
డీఎంకే సభ్యురాలు కనిమొళి కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమె ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తూత్తుకుడి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. దీంతో ఈ స్థానం కూడా ఖాళీగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments