Webdunia - Bharat's app for daily news and videos

Install App

షార్ సెంటర్ నుంచి గం. 5.30 నిమిషాలకు 'బాహుబలి' జీశాట్-19, త్వరలో రోదశిలోకి మానవుడు...

ఇస్రో చరిత్ర సృష్టించబోతోంది. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ఆ చరిత్రకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రపంచానికి బాహుబలి తన స్టామినా ఎలా చూపిందో... అదే రీతిన ప్రపంచ దేశాలు మనవైపే చూసే తొలి ప్రయోగం ఇవాళ జరుగుతోంది. అత్యంత భారీ రాకెట్ జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (15:42 IST)
ఇస్రో చరిత్ర సృష్టించబోతోంది. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ఆ చరిత్రకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రపంచానికి బాహుబలి తన స్టామినా ఎలా చూపిందో... అదే రీతిన ప్రపంచ దేశాలు మనవైపే చూసే తొలి ప్రయోగం ఇవాళ జరుగుతోంది. అత్యంత భారీ రాకెట్ జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్(జీఎస్‌ఎల్‌వీ) మార్క్-3 డీ1 ప్రయోగానికి మరికొన్ని గంటలే మిగిలి వున్నాయి.


సుమారు నాలుగు టన్నుల అంతరిక్ష వాహక నౌకను నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. షార్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకనున్న ఈ రాకెట్ ద్వారా జీశాట్-19 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టబోతున్నారు. 43.43 మీటర్ల ఎత్తున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్3-డీ1 ప్రయోగం 16:20 నిమిషాల్లో పూర్తవుతుంది.
 
ఇస్రో చరిత్రలోనే అతిపెద్ద ప్రయోగం కావడంతో దీన్నంతా బాహుబలి 1 అని పిలుచుకుంటున్నారు. శాస్త్రవేత్తలు కాదు సుమా. బయటి జనం. దీని ప్రయోగంతో ఇస్రో భవిష్యత్తులో మానవ సహిత ప్రయోగాలు నిర్వహించేందుకు మార్గం సుగమం కానుంది. ఈ అంతరిక్ష నౌక కోసం 18 ఏళ్లుగా శ్రమిస్తున్నారు. దీనికి రూ.300 కోట్లు ఖర్చు పెట్టారు. భారతదేశం తన సొంతగడ్డ పైనుంచి తొలిసారి ప్రయోగిస్తున్న అత్యంత భారీ ఉపగ్రహం కూడా ఇదే కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది. 
 
ఇది రోదసి నుంచి ఇంటర్నెట్ సేవలందించనున్న తొలి దేశీయ శాటిలైట్. హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో జీశాట్-19ని ప్రయోగిస్తున్నామనీ, ఇది కేవలం ఓ ట్రైలర్(బాహుబలి1) అనీ అసలు సినిమా(బాహుబలి2) అంతా మరికొద్ది నెలల్లో ప్రయోగించనున్న జీశాట్-11దేనని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తానికి ఈ బాహుబలి 1 కోసం ప్రపంచం మొత్తం ఇటువైపు చూస్తోంది. మనమూ చూద్దాం మరికొన్ని గంటల్లోనే...
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments